Rajanikanth: రజనీ సినిమాకి పవర్ఫుల్ టైటిల్!

Rajani 169 movie update

  • రజనీ 169వ సినిమాకి సన్నాహాలు
  • కథానాయికగా తెరపైకి ఐశ్వర్య రాయ్ పేరు
  • 'బాస్' టైటిల్ ను ఖరారు చేసినట్టుగా టాక్ 
  • వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన

రజనీకాంత్ సినిమా సెట్స్ పైకి వెళుతుందంటేనే అందరిలో ఒక రకమైన కుతూహలం మొదలవుతుంది. టైటిల్ దగ్గర నుంచి అందరూ దృష్టి పెడుతుంటారు. రజనీ సినిమాకి ఆయన స్థాయికి తగినట్టుగా టైటిల్ పవర్ఫుల్ గా ఉండాలి .. లేదంటే అభిమానులు అసంతృప్తికి లోనవుతారు .. అసహనాన్ని వ్యక్తం చేస్తారు.

ఇదిలావుంచితే, రజనీ 169వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి 'బాస్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా టాక్. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా సమాచారం. 

భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రజనీ సరసన నాయికగా ఐశ్వర్యరాయ్ నటించనున్నట్టు చెబుతున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రజనీ నుంచి ఇంతకుముందు వచ్చిన 'పెద్దన్న' నిరాశపరిచిన సంగతి విదితమే. 

Rajanikanth
Aishwarya Rai
Nelson
  • Loading...

More Telugu News