Statue of Equality: ముచ్చింతలలోని 'సమతాస్ఫూర్తి' కేంద్రం ప్రవేశ రుసుము పెంపు

samathamurthy Centre entry fee hiked

  • ప్రస్తుతం రూ. 150, రూ. 75గా ఉన్న ప్రవేశ రుసుము
  • ఒక్కసారిగా రూ. 50  పెంచేసిన నిర్వాహకులు
  • ఇక నుంచి నాలుగుసార్లు డైనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షో

ముచ్చింతలలోని శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించాలనుకునే వారికి ఇది కాస్త చేదువార్తే. సందర్శకుల ప్రవేశ రుసుమును పెంచుతూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75 లుగా ఉన్న ప్రవేశ రుసుమును వరుసగా రూ.200, రూ. 125 చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. బుధవారం సెలవు.

సమతాస్ఫూర్తి కేంద్రంలోని ప్రధాన ఆకర్షణ అయిన డైనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షోను ఇక నుంచి నాలుగుసార్లు ప్రదర్శిస్తారు. లీలానీరాజనం పేరుతో నిర్వహిస్తున్న ఈ వాటర్ ఫౌంటెయిన్ షోను మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శిస్తారు.

Statue of Equality
Samathamurthy
Hyderabad
Entry Fee
  • Loading...

More Telugu News