Andhra Pradesh: ఏపీ లిక్క‌ర్ బాండ్ల వేలానికి య‌మ గిరాకీ.. క్యూ క‌ట్టిన‌ ఈపీఎఫ్ఓ స‌హా 26 సంస్థ‌లు

huge responce for ap liquor bonds

  • పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల ఆసక్తి
  • రూ.5,080 కోట్ల పెట్టుబ‌డికి ఈపీఎఫ్ఓ సంసిద్ధ‌త‌
  • ఆసక్తి వ్య‌క్త‌ప‌ర‌చిన సంస్థ‌ల్లో ఆదిత్య బిర్లా కూడా

ఏపీ ప్ర‌భుత్వం లిక్క‌ర్ ఆదాయం ఆధారంగా జారీ చేస్తున్న బాండ్ల వేలానికి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. అధిక వ‌డ్డీ ఇవ్వ‌నున్న‌ట్లుగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు కూడా ఈ వేలంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్న‌ట్లుగా స‌మాచారం. ఇప్ప‌టికే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్ఓ) స‌హా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కూడా ఈ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది.

ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఏకంగా రూ.5,080 కోట్లను పెట్టుబడిగా పెట్టి ఏపీ లిక్క‌ర్ బాండ్ల‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధ‌ప‌డింద‌న్న వార్త‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. అలాగే, ఇంకా ఈ బాండ్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆదిత్య బిర్లా, మోర్గాన్ స్టాన్లీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స‌హా 26 సంస్థ‌లు ఆస‌క్తి చూపుతున్న‌ట్లుగా స‌మాచారం. వెర‌సి లిక్క‌ర్ బాండ్ల ద్వారా ఏపీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున నిధుల‌ను స‌మ‌కూర్చుకునే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Andhra Pradesh
YSRCP
YS Jagan
EPFO
Aditya Birla Group
Liquor Bonds
  • Loading...

More Telugu News