Saitej: మెగా మేనల్లుడు స్పీడ్ పెంచినట్టే!

Saitej new movie update

  • తన 15వ సినిమా షూటింగులో సాయితేజ్
  • మిస్టిక్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తి
  • కథానాయికగా సంయుక్త మీనన్  

సాయితేజ్ తన కెరియర్ ఆరంభంలోనే ఇటు యూత్ నుంచి .. అటు మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. యంగ్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఆయన, అనుకోకుండా ప్రమాదం బారిన పడటం వలన, కొంతకాలం పాటు సినిమాలకి దూరంగా ఉండవలసి వచ్చింది.

ఇక పూర్తిగా కోలుకున్న సాయితేజ్ ఇటీవలే సెట్స్ పైకి వెళ్లాడు. కెరియర్ పరంగా ఆయనకి ఇది 15వ సినిమా. బీవీఎస్ ఎన్ ప్రసాద్ -  సుకుమార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 30 శాతం చిత్రీకరణను పూర్తిచేశారట. మిస్టిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. 

ఈ సినిమాలో సాయితేజ్ సరసన నాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. 'భీమ్లా నాయక్' సినిమాతో పరిచయమైన ఈ కథానాయిక 'బింబిసార'లోను నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలోను సంయుక్తను తీసుకున్నారు. త్వరలోనే మిగతా విషయాలు తెలియనున్నాయి.

Saitej
Samyuktha Menon
Karthik Dandu
  • Loading...

More Telugu News