Sensex: కుప్పకూలిన మార్కెట్లు.. రూ. 6 లక్షల కోట్ల మేర సంపద ఆవిరి!

Markets collapses in todays trading

  • 1,456 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 427 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా నష్టపోయిన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా అన్ని దేశాల మార్కెట్లు ఈరోజు పతనమయ్యాయి. వీటి ప్రభావం మన మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనికి తోడు దేశీయంగా ద్రవ్యోల్బణ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. 

ఈరోజు మార్కెట్లు ప్రారంభమైన వెంటనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ చివరి వరకు అదే ధోరణి కొనసాగింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,456 పాయింట్లు కోల్పోయి 52,846కి పడిపోయింది. నిఫ్టీ 427 పాయింట్లు నష్టపోయి 15,774 కి దిగజారింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్ల మేర ఆవిరైనట్టు చెబుతున్నారు. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-7.02%), బజాజ్ ఫైనాన్స్ (-5.44%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.27%), టెక్ మహీంద్రా (-4.84%), ఐసీఐసీఐ బ్యాంక్ (-4.46%). 

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం నెస్లే ఇండియా (0.46%) మాత్రమే లాభపడింది.

  • Loading...

More Telugu News