Sai Pallavi: నేను ఏం కొన్నా ఓటీపీ మా అమ్మకి వెళుతుంది: సాయిపల్లవి

Sai Pallavi Interview

  • తనకి డాన్స్ అంటే  పిచ్చి అన్న సాయిపల్లవి 
  • మొదటినుంచీ డబ్బు ఇబ్బంది తెలియదంటూ వ్యాఖ్య 
  • అవకాశాలు రాని రోజున చేతిలో మెడిసిన్ ఉండనే ఉందన్న సాయిపల్లవి   

తెలుగులో ఇప్పుడు సాయిపల్లవికి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. 'విరాటపర్వం' సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి ఆమె రెడీ అవుతోంది. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఆమె మాట్లాడుతూ .. మొదటి నుంచి కూడా తనకు మెడిసిన్ అంటే ఇష్టమనీ, అలాగే డాన్స్ అంటే పిచ్చి అనీ పేర్కొంది.

"అందువల్లనే వాటిపై ఆసక్తిని చూపుతూ వెళ్లాను. నేను సినిమాల వైపు వస్తాననీ .. హీరోయిన్ ను అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మలయాళంలో 'ప్రేమమ్' సినిమా చేసేటప్పుడు కూడా నేను సీరియస్ గా తీసుకోలేదు. ఆ తరువాత అవకాశాలు పెరుగుతూ ఉండటంతో సినిమాలపైనే దృష్టి పెట్టాను. అవకాశాలు రాని రోజున చేతిలో మెడిసిన్ ఉండనే ఉంది" అని చెప్పింది.  

మొదటి నుంచి కూడా డబ్బు ఇబ్బంది తెలియకుండా తన తల్లిదండ్రులు పెంచారని సాయిపల్లవి చెప్పింది. 'ఏ వస్తువైనా ఎంతవరకూ మనకు అవసరమో ఆలోచన చేసిన తరువాతనే కొనడం జరుగుతుంది. ఇప్పటికీ నేను ఏదైనా కొంటే ఓటీపీ మా అమ్మకు వెళుతుంది. మొదటి నుంచి కూడా ఖర్చు ఏదైనా ఆమె చేతిపై నుంచి జరగడమే అలవాటు' అంటూ నవ్వేసింది.

Sai Pallavi
Virata parvam movie
Tollywood
  • Loading...

More Telugu News