Anushka Shetty: అనుష్క శెట్టి సోదరుడి హత్యకు కుట్ర!

Murder sketch plotted to kill Actress Anushka brother
  • అనుష్కకు ఇద్దరు సోదరులు
  • ఒక సోదరుడు గుణరంజన్ శెట్టి గ్యాంగ్ స్టర్
  • గుణరంజన్ హత్యకు స్కెచ్ వేసిన మరో గ్యాంగ్ స్టర్
ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి సోదరుడి హత్యకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని గ్యాంగ్ స్టర్ల మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, మంగళూరుకు చెందిన మాఫియా డాన్ ముత్తప్ప రై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్ శెట్టిలు కుడి, ఎడమ భుజంగా ఉండేవారు. ముత్తప్ప చనిపోయిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. గుణరంజన్ శెట్టి హత్యకు మన్విత్ రై స్కెచ్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

గుణరంజన్ మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హత్య చేసేందుకు మన్విత్ రై కుట్ర పన్నినట్టు సమాచారం. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్ తనకు భద్రత కల్పించాలని కోరారు.  

అనుష్కకు ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరు గుణరంజన్ షెట్టి, రమేశ్ షెట్టి. అనుష్క సోదరుడి హత్యకు స్కెచ్ వేసినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
Anushka Shetty
Tollywood
Brother
Murder Sketch

More Telugu News