Cristiano Ronaldo: అత్యాచారం కేసులో సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఊరట
- అత్యాచారం చేశాడంటూ రొనాల్డోపై మహిళ ఆరోపణలు
- కోర్టును ఆశ్రయించిన వైనం
- వాదనలు ముగించిన న్యాయస్థానం
- తుది తీర్పు వెలువరించిన జడ్జి
అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అత్యాచారం కేసు నుంచి విముక్తుడయ్యాడు. బాధితురాలి తరపు న్యాయవాది సరైన ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారంటూ ఈ కేసును కోర్టు కొట్టివేసింది.
2009లో లాస్ వేగాస్ లో తనపై రొనాల్డో అత్యాచారానికి పాల్పడ్డాడని కాథరిన్ మోయెర్గా అనే మహిళ కోర్టును ఆశ్రయించింది. ఓ హోటల్లో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తాజాగా వాదనలు ముగించిన న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. రోనాల్డో అత్యాచారానికి పాల్పడ్డాడని భావించలేమని పేర్కొంది. దాంతో, ఈ కేసు నుంచి రొనాల్డోకు ఊరట కలిగినట్టయింది.