Anupama Parameswaran: పవన్ కల్యాణ్ పై అభిప్రాయం చెప్పేంత స్థాయి నాకు లేదు: అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran talks about Powerstar

  • బటర్ ఫ్లై చిత్రంలో నటించిన అనుపమ
  • త్వరలో విడుదల కానున్న సినిమా
  • ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుపమ
  • పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని వెల్లడి

అతికొద్ది సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న అందాల నటి అనుపమ పరమేశ్వరన్. ఈ కేరళ బ్యూటీ ప్రేమమ్ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆపై శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలతో క్రేజ్ సంపాదించుకుంది. ఆమె నటించిన తాజా చిత్రం బటర్ ఫ్లై త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆమెను పవన్ కల్యాణ్ గురించి అడగ్గా ఆసక్తికర సంగతులు పంచుకుంది. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రాన్ని బురఖా వేసుకుని వెళ్లి చూశానని వెల్లడించింది. బటర్ ఫ్లై చిత్రం హీరో నిహాల్ తో కలిసి భీమ్లా నాయక్ విడుదలైన రోజే తొలి ఆట చూశానని పేర్కొంది. హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్ కు వెళ్లామని, తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బురఖా వేసుకున్నానని అనుపమ వివరించింది. అయితే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై అభిప్రాయం వెల్లడించేంత స్థాయి తనకు లేదని అనుపమ స్పష్టం చేసింది. పవన్ పెద్ద హీరో అని, ఆయనను తాను అభిమానిస్తానని వెల్లడించింది.

More Telugu News