Balka Suman: వారిద్దరిలో ఒకరికి కులపిచ్చి, మరొకరికి మతపిచ్చి: బాల్క సుమన్

Balka suman comments on Revanth Reddy and Bandi Sanjay

  • కేసీఆర్ అంటే ప్రాణం పోసే సంజీవని
  • కాంగ్రెస్ పని అయిపోయింది
  • బీజేపీ ఉన్మాద పార్టీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిది కులపిచ్చి, బండి సంజయ్ ది మతపిచ్చి అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ అనగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వణుకు పుట్టిందని చెప్పారు. కేసీఆర్ అంటే కాలం చెల్లిన మెడిసిన్ కాదని... ప్రాణం పోసే సంజీవని అని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బాల్క సుమన్ చెప్పారు. సోనియాగాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చినా ఆ పార్టీ పోరాడటం లేదని అన్నారు. కొన ఊపిరితో ఐసీయూలో ఉన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని చెప్పారు. బీజేపీ ఉన్మాద పార్టీ అని మండిడ్డారు. బీజేపీ దుర్మార్గాలను దేశ ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. బీజేపీది ఢిల్లీలో తుగ్లక్ పాలన అని, గల్లీలో తుగ్లక్ వాదన అని ఎద్దేవా చేశారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు. బండి సంజయ్ కు చేతనైతే విభజన హామీ చట్టాలను అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు.

Balka Suman
TRS
Revanth Reddy
Congress
Bandi Sanjay
BJP
  • Loading...

More Telugu News