India: దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. 45 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

Indian corona active cases reaching 45K

  • గత 24 గంటల్లో 8,582 మందికి కరోనా పాజిటివ్
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 44,513
  • 2.71 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 8 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత  24 గంటల్లో 8,582 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 4,435 మంది కరోనా నుంచి కోలుకోగా... నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 44,513 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,32,22,017కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,24,761 మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరుకుంది. రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోయింది. క్రియాశీల రేటు 0.10 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 194.9 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

India
Corona Virus
Updates
  • Loading...

More Telugu News