Kamal Haasan: 'విక్రమ్' ఫస్టు వీక్ వసూళ్లు ఇవే!

Vikram movie update

  • ఈ నెల 3వ తేదీన విడుదలైన 'విక్రమ్'
  • తొలి రోజుతోనే సాధించిన హిట్ టాక్ 
  • వారం రోజుల్లోనే 250 కోట్లకి పైగా వసూళ్లు
  • మరికొన్ని రోజుల పాటు సాగనున్న జోరు  

ఈ మధ్య కాలంలో తెలుగులో అనువాద సినిమాల హవా తగ్గింది. తమిళం నుంచి భారీ సినిమాలు వస్తున్నాయిగానీ, వాటికి ఒకప్పటి ఆదరణ మాత్రం లభించడం లేదు. ఇటీవల కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చి ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధిస్తున్న సినిమాగా 'విక్రమ్' మాత్రమే కనిపిస్తోంది. 

కమలహాసన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తమిళనాడులోనే కాదు .. తెలుగు రాష్ట్రాల్లోను .. ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. 

ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రోజుల్లో ఈ సినిమా 250 కోట్లకు మించిన వసూళ్లను రాబట్టడం విశేషం. ఫహాద్ ఫాజిల్ .. విజయ్ సేతుపతి .. సూర్య పాత్రలను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం వలన, 'విక్రమ్' జోరు మరికొన్ని రోజుల పాటు సాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Kamal Haasan
Vijay Sethupathi
Fhadh Faasil
Vikram Movie
  • Loading...

More Telugu News