Somu Veerraju: రాజకీయాలు పార్టీలు చూసుకుంటాయి... మీరు ప్రాజెక్టుల సంగతి చూడండి: అంబటి రాంబాబుకు సోము వీర్రాజు హితవు

Somu Veerraju comments on Ambati

  • ఆత్మకూరు ఉప ఎన్నికపై సోము వ్యాఖ్యలు
  • వైసీపీ ఇన్చార్జి మంత్రులను వెంబడిస్తామని వెల్లడి
  • ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని వ్యాఖ్యలు
  • రాజకీయాల కంటే పాలనపై దృష్టి పెట్టాలని అంబటికి సూచన

ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఇన్చార్జిలుగా నియమించిందని, ఓటర్లను ప్రభావితం చేయకుండా వారిని తాము వెంబడిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పష్టం చేశారు. తమ కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర పర్యటనకు వస్తుంటారని, కావాలంటే వారిని మీరు వెంబడించుకోవచ్చని వైసీపీ నేతలకు సూచించారు. 

రాజకీయాల కంటే మంత్రి అంబటి రాంబాబు పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. రాజకీయాలు పార్టీలు చూసుకుంటాయని అన్నారు. బీజేపీ చేపట్టిన యాత్ర అనంతరం 1972 నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం గుర్తించడం శుభపరిణామం అని సోము వీర్రాజు పేర్కొన్నారు. మంత్రి అంబటి రాంబాబు ఈ ప్రాజెక్టులపై శ్రద్ధ చూపాలని అన్నారు. మంత్రులు రాజకీయాల జోలికి వెళ్లకుండా పరిపాలన చేస్తే బాగుంటుందని సూచించారు.

Somu Veerraju
Ambati Rambabu
Projects
BJP
YSRCP
  • Loading...

More Telugu News