Balakrishna: 'భయం నా బయోడేటాలోనే లేదురా..' బాలకృష్ణ 107వ సినిమా టీజర్ రిలీజ్!

Balakrishna in Gopichand Malineni movie

  • షూటింగు దశలో బాలయ్య 107వ సినిమా
  • రేపు ఆయన పుట్టిన రోజు 
  • ఆ సందర్భంగా వదిలిన టీజర్
  • ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • దసరాకి సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్  

ఫ్యాక్షన్ నేపథ్యంలో పవర్ఫుల్ పాత్రలు చేయడం బాలయ్యకి కొట్టిన పిండి. ఈ మధ్య కాలంలో ఆయన ఫ్యాక్షన్ సినిమా చేయలేదు. మళ్లీ ఆయనను అదే తరహా పాత్రలో చూపించడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని  ప్రయత్నిస్తున్నాడు. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. 

రేపు బాలకృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్  చేశారు. గతంలో మాదిరిగానే సింహాన్ని బాలకృష్ణకి సింబాలిక్ గా చూపిస్తూనే .. మలుపులతో కూడిన దారి  .. కార్ల వరసలు .. బాలయ్య మార్కు యాక్షన్ ను ఆవిష్కరించారు. 

'మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ .. నా జీవో గాడ్స్ ఆర్డర్' .. 'భయం నా బయోడేటాలోనే లేదురా ..' వంటి డైలాగ్స్ పవర్ఫుల్ గా ఉన్నాయి. బాలయ్య లుక్ కొత్తగా బాగుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేసే ఆలోచలో ఉన్నారు.

Balakrishna
Sruthi Haasan
Gopichand Malineni

More Telugu News