Andhra Pradesh: పాపం.. రానివ్వండి లోకేశ్ గారూ..: కొల్లు రవీంద్ర

Kollu Ravindra Sattires On Vamshi and Kodali Nani
  • లోకేశ్ జూమ్ మీటింగ్ లోకి వంశీ, కొడాలి నాని ఎంట్రీపై రవీంద్ర స్పందన
  • ఒకరికి పదవి లేదు.. ఇంకొకరికి ఏ పార్టీలో ఉన్నారో క్లారిటీ లేదంటూ విమర్శ 
  • మీడియా పబ్లిసిటీ కోసం కక్కుర్తి పడుతున్నారని ఎద్దేవా
మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ఒకరికి పదవి లేదని, మరొకరికి ఏ పార్టీలో ఉన్నారో క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. టెన్త్ విద్యార్థులతో లోకేశ్ జూమ్ మీటింగ్ సందర్భంగా వాళ్లిద్దరూ సడన్ గా కాన్ఫరెన్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిపై కొల్లు రవీంద్ర స్పందించారు. 

ఇలా కనిపించైనా మీడియాలో పబ్లిసిటీ కోసం కక్కుర్తి పడుతున్నారని, పాపం.. రానివ్వండి లోకేశ్ గారూ అంటూ ట్వీట్ చేశారు. విద్య విలువ తెలియని మూర్ఖుని పాలనలో పదో తరగతి విద్యార్థుల ఆర్తనాదాలు వినిపించవని, వారి ఆత్మహత్యలు కనిపించవని అన్నారు.
Andhra Pradesh
Telugudesam
Kollu Ravindra
Nara Lokesh
Vallabhaneni Vamsi
Kodali Nani

More Telugu News