Vijay Devarakonda: 'జన గణ మన' కోసం అత్యధిక పారితోషికం అందుకుంటున్న పూజ హెగ్డే?

Jana Gana Mana Movie Update

  • వరుస ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డే
  • అయినా తగ్గని డిమాండ్
  • 'జన గణ మన'లోను దక్కిన ఛాన్స్ 
  • పారితోషికం విషయంలో కొత్త రికార్డు   

పూజ హెగ్డేకి ఈ మధ్య కాలంలో వరుసగా భారీ పరాజయాలు ఎదురయ్యాయి. ప్రభాస్ సరసన కథానాయికగా చేసిన 'రాధే శ్యామ్' .. చరణ్ జోడీగా చేసిన 'ఆచార్య' .. విజయ్ కాంబినేషన్లో చేసిన 'బీస్ట్' ఆమె అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. అయినా ఆమె డిమాండ్ ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషం.  

పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన 'లైగర్' ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే కాంబినేషన్లో 'జన గణ మన' రూపొందనుంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమా కోసం కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. అందుకు ఆమెకి చెల్లించే పారితోషికం 5 కోట్లు అని అంటున్నారు. 

 టాలీవుడ్ హీరోయిన్స్ ఇంతవరకూ అందుకుంటూ వచ్చిన అత్యధిక పారితోషికం ఇదే. అలాగే తన కెరియర్లో పూజ హెగ్డే ఈ స్థాయి పారితోషికాన్ని అందుకుంటూ ఉండటం కూడా ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఇక త్రివిక్రమ్ -  మహేశ్ బాబు సినిమాలోనూ కథానాయిక పూజ హెగ్డే అనే విషయం తెలిసిందే.

Vijay Devarakonda
Pooja Hegde
Jana Gana Mana Movie
  • Loading...

More Telugu News