Nani: టాలీవుడ్ లో ఈ స్టార్ హీరోలతో నటించాలని ఉంది: నజ్రియా

Ante Sundaraniki Nazria Interview

  • మలయాళ స్టార్ హీరోయిన్ గా నజ్రియా 
  • 'అంటే .. సుందరానికీ' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం 
  • రేపు భారీ స్థాయిలో విడుదలవుతున్న సినిమా
  • ఎన్టీఆర్ .. మహేశ్ .. చరణ్  లతో చేయాలనుందన్న నజ్రియా

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి కొత్తగా కొంతమంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. ఆ జాబితాలో మలయాళ బ్యూటీ నజ్రియా కూడా చేరనుంది. ఆమె కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమాగా 'అంటే .. సుందరానికీ' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని కథానాయకుడుగా నటించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నజ్రియా మాట్లాడుతూ .. "టాలీవుడ్ నాకు బాగా నచ్చింది .. ఇక్కడి వాతావరణానికి నేను చాలా ఫాస్టుగా అలవాటు పడిపోయాను. నాని సినిమాలో తప్పకుండా కొత్తదనం ఉంటుంది .. ఆయన అంగీకరించాడంటే ఆ కథలో విషయం ఉంటుంది. అందువల్లనే ఈ సినిమాకి ఓకే చెప్పడానికి నేను పెద్దగా సమయం తీసుకోలేదు. 

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను నేను తప్పకుండా చూస్తుంటాను. ఎవరి స్టైల్ వారిది .. అందరితోను కలిసి నటించాలని ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ లతో కలిసి నటించాలని ఉంది. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. ఇక కోలీవుడ్ లో ఎవరితో చేయాలని ఉందని అడిగితే మాత్రం నేను చెప్పే పేరు అజిత్" అంటూ సమాధానమిచ్చింది.

Nani
Nazriya
Ante Sundaraniki Movie
  • Loading...

More Telugu News