Gopichand: 'పక్కా కమర్షియల్' నుంచి ట్రైలర్ గ్లింప్స్!

Pakka Commercial trailer glimpse released

  • మారుతి నుంచి 'పక్కా కమర్షియల్'
  • గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా 
  • సంగీత దర్శకత్వం వహించిన జేక్స్ బిజోయ్
  • జులై 1వ తేదీన సినిమా విడుదల

గోపీచంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' సినిమా రూపొందింది. ఇద్దరి మార్కుతో యాక్షన్ కామెడీగా ఈ సినిమా రానుంది. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ బ్యానర్లలో ఈ సినిమా నిర్మితమైంది. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇది కూడా మారుతి మార్కులోనే కనిపిస్తోంది. పూర్తి ట్రైలర్ ను ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. గతంలో గోపీచంద్ , రాశి ఖన్నా కాంబినేషన్లో వచ్చిన 'జిల్' సినిమా బాగానే ఆడింది. అలాగే మారుతి, రాశి ఖన్నా కంబోల్ప్ వచ్చిన 'ప్రతి రోజూ పండగే' కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. 

అందువలన 'పక్కా కమర్షియల్' పై అందరిలో ఆసక్తి ఉంది. కొంతకాలంగా ఇటు మారుతికి .. అటు గోపీచంద్ - రాశి ఖన్నాకి సక్సెస్ లేదు. అందువలన ఈ సినిమాపైనే ఈ ముగ్గురూ గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు., వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి. జులై 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది

Gopichand
Rashi Khanna
Pakka Commercial Movie

More Telugu News