Kshama Bindu: తనను తానే పెళ్లాడాలనుకున్న అమ్మాయికి మరో కష్టం... వెనుకంజ వేసిన పురోహితుడు

Priest says no to recite mantras at Kshama Bindu sologomy

  • సోలోగమీ ప్రకటన చేసిన క్షమా బిందు
  • తనను తానే పెళ్లాడతానని వెల్లడి
  • ఆలయంలో పెళ్లికి అంగీకరించని పాలకమండలి
  •  పెళ్లి తంతు జరిపించలేనన్న పురోహితుడు

ఇటీవల గుజరాత్ కు చెందిన క్షమా బిందు అనే బ్లాగర్ తనను తానే పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. భారత్ లో ఇలాంటి వివాహం (సోలోగమీ) ఇదే మొదటిది కావడంతో అందరి దృష్టి క్షమా బిందుపై పడింది. 24 ఏళ్ల క్షమా బిందు ప్రస్తుతం వడోదరాలో ఉంటోంది. ఈ నెల 11న పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె ఇప్పటికే శుభలేఖలు కూడా అచ్చువేయించింది. స్థానిక గోత్రి ఆలయంలో తన పెళ్లి జరగనుందని పేర్కొంది. అయితే ఆలయంలో ఇటువంటి పెళ్లిళ్లకు తాము అనుమతించలేమని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. 

తాజాగా, క్షమా బిందుకు మరో కష్టం వచ్చిపడింది. ఇంటివద్దనైనా పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మడికి పురోహితుడు కూడా హ్యాండిచ్చేశాడు. ఈ పెళ్లి తంతు తాను జరిపించలేనని ఆయన తప్పుకున్నాడు. దీనిపై క్షమా బిందు ఓ వీడియోలో మాట్లాడుతూ, పురోహితుడు కూడా వెనక్కి తగ్గాడని, తన పెళ్లికి వేదిక కూడా లేకుండా పోయిందని వెల్లడించింది. 

ఆన్ లైన్ లో చూసి పెళ్లి మంత్రాలు చదువుతూ తన పెళ్లి తానే జరిపించుకుంటానని పేర్కొంది. అంతేకాదు, తన పెళ్లిని రిజిస్టర్ చేయించుకుంటానని చెబుతోంది. 

కాగా, సోలోగమీ ప్రకటన చేసినప్పటి నుంచి క్షమా బిందు ఫ్లాట్ కు మీడియా ప్రతినిధుల తాకిడి పెరిగింది. దాంతో ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోని వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, తన ఇంటికి మీడియా దూరంగా ఉండాలంటూ క్షమా బిందు ఓ బోర్డు తగిలించింది.

Kshama Bindu
Sologomy
Priest
Mantras
Gujarat
  • Loading...

More Telugu News