Kamal Haasan: సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్ ను కానుకగా ఇచ్చిన కమలహాసన్

Kamal Haasan presents Suriya a beatiful Rolex watch

  • ఇటీవల విడుదలైన్ కమల్ కొత్త చిత్రం విక్రమ్
  • ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించిన సూర్య
  • సూర్య పాత్ర పేరు రోలెక్స్
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో రోలెక్స్ పేరు
  • సినిమా సక్సెస్ కావడంతో కమల్ ఆనందం

కమలహాసన్ నటించిన తాజా చిత్రం విక్రమ్ ఇటీవలే విడుదలై ప్రజాదరణ పొందుతోంది. తన చిత్రం విజయం సాధించడం పట్ల కమల్ పొంగిపోతున్నారు. ఈ క్రమంలో, విక్రమ్ చిత్రంలో అతిథి పాత్ర పోషించిన అగ్రహీరో సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్ ను ఆయన కానుకగా ఇచ్చారు. 

కమల్ అంతటివాడి నుంచి గిఫ్ట్ అందుకోవడం పట్ల సూర్య ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. రోలెక్స్ వాచ్ బహూకరించినందుకు 'థాంక్యూ అన్నా' అంటూ సోషల్ మీడియాలో తన స్పందన వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇవి అందమైన క్షణాలు అని పేర్కొన్నాడు. 

సూర్యకు కమల్ రోలెక్స్ వాచ్ గిఫ్టుగా ఇవ్వడానికి బలమైన కారణమే ఉంది. విక్రమ్ చిత్రంలో సూర్య అతిథి పాత్ర పోషించారు. ఐదు నిమిషాల పాటు కనిపించే ఈ పాత్ర పేరు రోలెక్స్. విక్రమ్ చిత్రం రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో రోలెక్స్ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అందుకే సూర్యకు కమల్ రోలెక్స్ వాచీని బహూకరించి తన సంతోషాన్ని పంచుకున్నారు.

Kamal Haasan
Suriya
Rolex Watch
Vikram Movie
Kollywood
  • Loading...

More Telugu News