Talasani: మృగశిర కార్తె సందర్భంగా తలసానికి కొరమీను చేపలను అందించిన మత్స్యకారులు

Fishermen gives korrameenu fish to Talasani

  • రాష్ట్రంలో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారన్న తలసాని
  • నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని వ్యాఖ్య
  • ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు

తెలంగాణలో మత్స్య సంపద బాగా పెరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో మత్స్యకారులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్ కు చెందిన మత్స్యకారులు తలసానికి కొరమీను చేపలను అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యలతో మత్స్యకారుల ఆదాయం ఎంతో పెరిగిందని తెలిపారు. అందరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. తమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున మత్స్యశాఖ మంత్రికి కొరమీను చేపలను అందిస్తున్నట్టు చెప్పారు.

Talasani
TRS
Fishermen
  • Loading...

More Telugu News