Kamal Haasan: తెలుగు రాష్ట్రాల్లో 'విక్రమ్' 3 రోజుల వసూళ్లు!

Vikram movie update

  • ఈ నెల 3వ తేదీన విడుదలైన 'విక్రమ్'
  •  ప్రతి ప్రాంతంలోను భారీగా నమోదవుతున్న వసూళ్లు 
  • తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమా 
  • వీకెండ్ తరువాత కూడా తగ్గని దూకుడు

చాలాకాలం తరువాత కమల్ తన సొంత బ్యానర్లో మరో ప్రయోగం చేశారు .. ఆ ప్రయోగం పేరే 'విక్రమ్'. ఈ భారీ యాక్షన్  సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగులో ఈ సినిమాను హీరో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ నుంచి రిలీజ్ చేశారు. మొదటి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. కోలీవుడ్లోను .. ఓవర్సీస్ లోను ఈ సినిమా దుమ్మురేపేస్తున్న సంగతి తెలిసిందే.

లోకేశ్ కనగరాజ్ టేకింగ్ .. కమల్ లుక్ .. ఆయన యాక్టింగ్ .. అక్కడక్కడా ఆశ్చర్య చకితులను చేసే ట్విస్టులు, సూర్య .. విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్  .. నరేన్ వంటి బలమైన తారాగణం ఈ సినిమా సక్సెస్ లో కీలకమైన పాత్రను పోషించాయని చెప్పచ్చు. అన్ని ప్రాంతాల్లో వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా వసూళ్లు నిలకడగా ఉండటం విశేషం.

Kamal Haasan
Vijay Sethupathi
Surya
Vikram Movie
  • Loading...

More Telugu News