Prophet: మమహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన తాలిబాన్ సర్కారు

Prophet remark spreads to more countries now Taliban lectures India on fanatics

  • ఇతర ఇస్లాం దేశాల సరసన చేరిన ఆప్ఘనిస్థాన్
  • మతోన్మాదులను అనుమతించొద్దని సూచన
  • అవి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలని భారత్ వివరణ 

భారత్ కు గతంలో ఎన్నడూ లేనంత గౌరవం ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో నెలకొని ఉంది. మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి బీజేపీ మాజీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ ఘటన తర్వాత ఇస్లాం దేశాలన్నీ భారత్ కు వ్యతిరేకంగా ఒక్కటైనట్టు కనిపిస్తోంది. ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, యూఏఈ, జోర్డాన్, పాకిస్థాన్, బహ్రెయిన్, మాల్దీవులు, లిబియా, ఇండోనేషియా ఇవన్నీ బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా తప్పుబట్టాయి. భారత సర్కారును లక్ష్యం చేసుకున్నాయి.

చివరికి మానవ హక్కులను కాలరాసి, రాక్షస పాలన సాగిస్తున్న తాలిబన్ సర్కారు (ఆఫ్ఘానిస్థాన్) సైతం ఈ విషయంలో భారత్ కు పాఠాలు చెప్పే ప్రయత్నం చేయడమే విడ్డూరంగా ఉంది. ‘‘పవిత్ర ఇస్లామ్ ను అవమానించడం, ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టే దిశగా మతోన్మాదులు వ్యాఖ్యానించకుండా భారత్ సర్కారు చర్యలు తీసుకోవాలి’’ అని తాలిబన్ అధికార ప్రతినిధి జబీదుల్లా ముజాహిద్ డిమాండ్ చేశారు. ప్రవక్తపై వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇప్పటి వరకు 14 దేశాలు బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించాయి. 

అయితే, అవి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు అని, వారిపై సంబంధిత పార్టీ చర్యలు కూడా తీసుకున్నట్టు భారత సర్కారు స్పష్టం చేసింది. వ్యక్తుల అభిప్రాయాలను భారత ప్రభుత్వానికి ఆపాదించొద్దని, అన్ని మతాలను సమానంగా గౌరవించడమే తమ విధానమని స్పష్టం చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News