Jogi Ramesh: మంత్రి జోగి రమేశ్ కు తప్పిన ప్రమాదం

Minister Jogi Ramesh escapes from road accident

  • చిలకలూరిపేట నుంచి నెల్లూరుకి వెళ్తుండగా ప్రమాదం
  • హోరు గాలికి ఎగిరిపడ్డ కోన్ లు
  • కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్న వైనం

ఏపీ మంత్రి జోగి రమేశ్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. చిలకలూరిపేట నుంచి నెల్లూరుకి కారులో వెళ్తుండగా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. 

నేషనల్ హైవేపై పనుల నిమిత్తం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా దారి మళ్లింపు కోసం బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, హోరు గాలికి కోన్ లు ఎగిరి రోడ్డుకు అడ్డంగా పడటంతో కాన్వాయ్ లోని ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

దీంతో మంత్రి రమేశ్ ప్రయాణిస్తున్న వాహనం కూడా అదుపు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత జోగి రమేశ్ మరో కారు ఎక్కి వెళ్లిపోయారు. ఘటన జరిగిన ప్రదేశానికి హైవే మొబైల్ సిబ్బంది, స్థానిక సీఐ శ్రీనివాసరెడ్డి చేరుకుని పరిశీలించారు. దెబ్బతిన్న కారును పక్కకు తొలగించారు.

Jogi Ramesh
YSRCP
Accident
  • Loading...

More Telugu News