Devineni Uma: నేను ఇలాంటి ట్వీట్ పెట్టానంటే ప్రజలు నమ్ముతారని ఎలా అనుకున్నావు?: అంబటికి దేవినేని ఉమ కౌంటర్

Devineni Uma counters Ambati

  • ఉమ ఓ ట్వీట్ చేశాడంటూ వెల్లడించిన అంబటి
  • అది ఫేక్ ట్వీట్ అని కొట్టిపారేసిన ఉమ
  • ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో అని హితవు
  • ఇంకెంతకాల పబ్బం గడుపుకుంటారని ఆగ్రహం

ఉట్టికి ఎగరలేనమ్మ... స్వర్గానికి వెళతాను అన్నదంట... అలా ఉంది... ఒక్కచోట కూడా గెలవని సన్నాసులు మాకు ఆప్షన్లు ఇవ్వడం చూస్తుంటే... అంటూ తాను ట్వీట్ చేసినట్టుగా మంత్రి అంబటి రాంబాబు పేర్కొనడాన్ని టీడీపీ నేత దేవినేని ఉమ ఖండించారు. అది ఫేక్ ట్వీట్ అని స్పష్టం చేశారు. ఇలాంటి ట్వీట్ తాను పెట్టానంటే ప్రజలు నమ్ముతారని ఎలా అనుకున్నావు? అంటూ అంబటిని ప్రశ్నించారు. ఫేక్ ప్రచారాలతో ఇంకెంతకాలం పబ్బం గడుపుకుంటారని ఉమ మండిపడ్డారు. 

పింక్ డైమండ్, ఆరు లక్షల కోట్ల అవినీతి అంటూ ఫేక్ ప్రచారాలు చేశారని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఇకనైనా ఫేక్ ప్రచారాలు, ఫేక్ న్యూస్ లు మానుకో అంటూ అంబటికి హితవు పలికారు.

Devineni Uma
Mukesh Ambani
Tweet
Fake
TDP
YSRCP

More Telugu News