Balakrishna: బాలయ్య సినిమాలో అంజలి నెగెటివ్ రోల్?

Anjali in Balakrishna Movie

  • తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి క్రేజ్ 
  • ఇటీవల కాలంలో తగ్గిన అవకాశాలు 
  • 'వకీల్ సాబ్' తర్వాత తెలుగులో రాని అవకాశం 
  • బాలయ్య - అనిల్ రావిపూడి కాంబో కోసం వినిపిస్తున్న పేరు
  • ఆల్రెడీ బాలయ్యతో 'డిక్టేటర్' చేసిన అంజలి

తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ ఉంది. తెలుగు నుంచి కూడా ఆమె ఖాతాలో హిట్ సినిమాలు ఉన్నాయి. నాయిక ప్రధానమైన పాత్రలను కూడా సమర్థవంతంగా పోషించగలననే విషయాన్ని ఆమె నిరూపించుకుంది. అయితే, ఈ మధ్య  కాలంలో అంజలికి సరైన అవకాశాలు లేవు .. తన స్థాయికి తగిన పాత్రలూ పడలేదు.

'నిశ్శబ్దం' .. 'వకీల్ సాబ్' సినిమాల తరువాత ఆమె ఇక్కడ ఏ సినిమాలు చేయలేదు. తాజాగా మాత్రం బాలకృష్ణ సినిమా కోసం ఆమె పేరు వినిపిస్తోంది. బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి అనిల్ రావిపూడి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇది తండ్రీ కూతుళ్ల అనుబంధం ప్రధానంగా సాగుతుందని తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. 

ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుందని ఆయనే చెప్పాడు. ఇక కథానాయికలుగా ప్రియమణి - మెహ్రీన్ పేర్లు వినిపించాయి. తాజాగా అంజలి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో అంజలి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించనుందనే టాక్ వినిపిస్తోంది. 'డిక్టేటర్' తరువాత బాలయ్యతో ఆమె చేసే సినిమా ఇదే అవుతుంది.

Balakrishna
Sreeleela
Anjali
Anil Ravipudi Movie
  • Loading...

More Telugu News