Nupur Sharma: నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను పార్టీ నుంచి తొలగించిన బీజేపీ హైకమాండ్

BJP suspends Nupur Sharma and Navin Zindal

  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు
  • తీవ్రంగా పరిగణించిన బీజేపీ హైకమాండ్
  • ఇద్దరి ప్రాథమిక సభ్యత్వాలు రద్దు
  • మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు సహించబోమని వెల్లడి

మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ జాతీయ మీడియా ప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్చార్జి నవీన్ జిందాల్ లపై వేటు పడింది. వారిద్దరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ట్విట్టర్ లో మహ్మద్ ప్రవక్తపై స్పందించిన నవీన్ జిందాల్ ను కూడా బీజేపీ హైకమాండ్ ఏమాత్రం ఉపేక్షించలేదు. వారిద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది.

బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని వెల్లడించింది. పౌరులు ఏ మతాన్ని అయినా స్వేచ్ఛగా ఎంచుకునే హక్కు రాజ్యాంగం ద్వారా లభించిందని, దీన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. 

ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో కాన్పూర్ లో ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. కాన్పూర్ లో హింస కూడా చోటుచేసుకుంది. కాన్పూర్ లో ఆగ్రహావేశాలు రగులుకుంటున్న సమయంలో ట్విట్టర్ లో మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి నవీన్ జిందాల్ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.

Nupur Sharma
Naveen Kumar Jindal
BJP
India
  • Loading...

More Telugu News