: బీరుపోసే 'బొమ్మ'


మీరు బీరు తాగుతున్న సమయంలో మీ గ్లాసులో బీరు అయిపోయిందనుకోండి... అప్పుడు మీరు ప్రిజ్‌ వద్దకు వెళ్లి బీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ మర బొమ్మను గనుక మీరు తెచ్చుకుంటే మీకు ఎప్పుడు బీరు కావాలంటే అప్పడు ఇది ప్రిజ్‌నుండి తెచ్చి పోస్తుంది. అంతేకాదు... మీ గ్లాసులో బీరు ఖాళీ అయిపోతే కూడా అది గ్రహించేసి వెంటనే అందులోకి సర్వ్‌ చేస్తుంది. ఈ కొత్త రకం మరబొమ్మ అదేనండీ... రోబోను మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కొత్తరకం రోబోలు మనిషి చర్యలను ముందుగానే గ్రహించి, ఎప్పుడు సదరు వ్యక్తికి బీరు కావాలో అర్ధం చేసుకోగలవు. ఈవిధంగా వాటిలో పోగ్రామ్‌ను రూపొందించారు.

ఫ్రిజ్‌నుండి బీరు తీసుకువచ్చే సమయంలో వస్తువులు అడ్డు తగిలితే, వాటిని అధిగమించేలా ఈ కొత్త రోబోను రూపొందించినట్టు కార్నెల్‌ పర్సనల్‌ రోబోటిక్స్‌ ల్యాబ్‌కు చెందిన పరిశోధకులు అంటున్నారు. ఈ రోబోలో మైక్రోసాఫ్ట్‌ కినెక్ట్‌ 3డీ కెమెరా, 3డీ వీడియో డేటాబేస్‌లతో రోబోకు ఎదురయ్యే పరికరాలను గుర్తించే విధంగా రూపొందించామని, తాము రూపొందించిన ఈ కొత్త రోబో పరిజ్ఞానం భోజనం చేయడం, శుభ్రం చేయడం వంటి పనుల్లో కూడా సహకరించే విధంగా మరో కొత్త రకం రోబోలను తయారు చేయడానికి ఉపకరిస్తుందని, కాఫీ తాగే క్రమంలోని చర్యలను దృష్టిలో ఉంచుకొని తాము ఈ కొత్త రోబోను అభివృద్ధి చేశామని కార్నెల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ అశుతోష్‌ సక్సేనా అంటున్నారు.

ఇందులో కొన్ని కొన్ని చర్యలను గుర్తించేందుకు కూడా అవసరమైన పదాలను కూడా అమర్చామని, వర్తమానం నుండి ఒక సెకను తర్వాత ఏం కావలి? అనే విషయాన్ని అంచనా వేయడంలో ఈ రోబో 82 శాతం సరైన ఫలితాలను ఇచ్చిందని, అలాగే మూడు సెకన్ల తర్వాత మనకు ఏం కావాలి? అనే విషయాన్ని అంచనా వేయడంలో 71 శాతం, పది సెకన్ల తర్వాత ఏం కావాలి? అనే విషయాన్ని అంచనా వేడయంలో 57 శాతం ఫలితాలను ఇచ్చిందని అశుతోష్‌ తెలిపారు. జూన్‌ 18 నుండి 21 వరకూ అట్లాంటాలో నిర్వహించే ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ మెషిన్‌ లెర్నింగ్‌లోను, జూన్‌ 24 నుండి 28 వరకూ బెర్లిన్‌లో నిర్వహించే 'రోబోటిక్స్‌ : సైన్స్‌, సిస్టవమ్స్‌' కాన్ఫరెన్స్‌లోను కార్నెల్‌ విద్యార్ది హేమ ఎస్‌ కొప్పులతో కలిసి తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News