Samantha: మరోసారి విజయ్ తో జతకడుతున్న సమంత

Samantha to pair with Vijay

  • పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెంచుకుంటున్న సమంత
  • ఇప్పటికే విజయ్ సరసన మూడు సినిమాల్లో నటించిన సామ్
  • ఇప్పుడు మరోసారి విజయ్ సరసన అవకాశం

దక్షిణాదిలో హీరోయిన్ సమంత ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగుతో పాటు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సమంత... ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె దర్శకుడు గుణశేఖర్ చిత్రం 'శాకుంతలం', విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' సినిమాలతో పాటు 'యశోద' చిత్రంలో నటిస్తోంది. 

తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ఆమె మరో అవకాశాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం విజయ్ తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

మరోపక్క, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తదుపరి సినిమాను చేయనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుంది. ఇప్పటికే విజయ్, సమంత మూడు చిత్రాల్లో కలిసి నటించారు. ఈ చిత్రాలన్నీ విజయం సాధించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో చిత్రం కానుంది.

Samantha
Vijay
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News