Adivi Sesh: 'మేజర్' మూవీ హైలైట్స్ ఇవే!

Major movie update

  • నిన్ననే థియేటర్స్ కి వచ్చిన 'మేజర్'
  • సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో జీవించిన అడివి శేష్
  • అడుగడుగునా ఉద్వేగపూరితమైన సన్నివేశాలు
  • కన్నీళ్లు పెట్టించే భావోద్వేగాలు  

'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్' జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన 'మేజర్' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. ఫస్టాఫ్ కాస్త స్లోగా అనిపించినప్పటికీ, ఆ తరువాత హైలైట్  సీన్స్ చాలానే కనిపిస్తాయి. 

హోటల్ తాజ్ పై ఉగ్రదాడి జరిగిందని తెలిసి హీరో తన లీవ్ కేన్సిల్ చేసుకోవడం .. ట్రైనింగ్ ఆఫీసర్స్ ఇలాంటి ఆపరేషన్స్ కి దూరమని పైఅధికారి చెబుతున్నా వినిపించుకోకుండా రంగంలోకి దిగడం .. తన మెడలో బుల్లెట్ దిగిందని  పైఅధికారి చెప్పినప్పుడు దానిని గ్రహించడం వంటి సీన్స్ హీరోకి వృత్తి పట్ల గల అంకితభావానికి అద్దంపడతాయి .. ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 

హోటల్ తాజ్ లో ఆ రోజుకి ఆపరేషన్ ఆపేస్తున్నట్టుగా పైఅధికారి చెబుతాడు. అదే సమయంలో ఆ హోటల్లోని 5వ అంతస్తులో ప్రమోదిని .. ఒక పాప తీవ్రవాదులకు అందుబాటులో ఉన్నారని తెలిసి, ధైర్యంగా హీరో ముందుకు వెళ్లే సీన్స్ విజిల్స్ వేయిస్తాయి. ఇక మేజర్ సందీప్ చనిపోయాడనే వార్తలు టీవీలో చూసిన అతని తల్లి, తన కొడుకు తనకి ఎదురైతే బాగుండుననే ఆశతో వర్షంలో నడుస్తూ వెళ్లే సీన్ చూసి కన్నీళ్లు పెట్టనివారు దాదాపుగా ఉండరంటే అతిశయోక్తి కాదు.

Adivi Sesh
Saiee Manjrekar
Sobhitha Dhulipala
Major Movie
  • Loading...

More Telugu News