Junior NTR: పరిశీలనలో ఉన్న చరణ్ .. మహేశ్ .. ఎన్టీఆర్ మూవీ టైటిల్స్ ఇవే!

New Movies Update

  • ఆసక్తిని రేకెత్తిస్తున్న స్టార్ హీరోల టైటిల్స్ 
  • చరణ్ సినిమా టైటిల్ గా 'అధికారి'
  • మహేశ్ మూవీకి 'అర్జునుడు'ను ఖరారు చేసే ఛాన్స్
  • ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ అనుకుంటున్న టైటిల్ 'అసురుడు'

ఇప్పుడు స్టార్ హీరోలంతా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. చరణ్ తాజా చిత్రం శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. అందువలన ఈ సినిమాకి 'అధికారి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. 

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు ప్రాజెక్టు ప్రలెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు త్వరలో మొదలుకానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారని అంటున్నారు. 

ఇక ఎన్టీఆర్ తన 30వ సినిమా కోసం కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి టైటిల్ గా 'అసురుడు' అనుకుంటున్నారు. మాస్ యాక్షన్ జోనర్లో ఈ కథ నడుస్తుందట. ఈ ముగ్గురు హీరోల సినిమాల టైటిల్స్ 'అ' అనే అక్షరంతో మొదలవుతూ ఉండటం విశేషం.

Junior NTR
Charan
Mahesh Babu
  • Loading...

More Telugu News