Poorna: 'ఢీ' షో మానేయడానికి కారణం ఇదే: హీరోయిన్ పూర్ణ

In Dhee show we have to give hugs says Poorna
  • హగ్స్ ఇవ్వలేకే షో నుంచి తప్పుకున్నానన్న పూర్ణ
  • డ్యాన్సర్లకు, డ్యాన్స్ మాస్టర్లకు, యాంకర్స్ కు హగ్స్ ఇవ్వాలని వెల్లడి
  • ఆ పని చేయడం తనకు ఇష్టం లేదని వ్యాఖ్య
కేరళ కుట్టి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే పూర్ణ... మన సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. నిండైన వస్త్రధారణతో ఫ్యామిలీ ఆడియన్స్ మనస్సులను గెలుచుకుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే, పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. 'ఢీ' కార్యక్రమానికి కొన్నాళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన ఆమె... ఆ తర్వాత ఆ షో నుంచి తప్పుకుంది. ఆ షో నుంచి ఎందుకు తప్పుకుందనే విషయాన్ని ఇన్నాళ్లకు ఆమె వెల్లడించింది. 

కౌగిలింతలు ఇవ్వలేకే ఆ షో నుంచి తప్పుకున్నానని పూర్ణ సంచలన విషయాన్ని తెలిపింది. ఆ షోలో డ్యాన్స్ బాగా చేశారంటూ డ్యాన్సర్లకు హగ్స్ ఇవ్వాలని... వాళ్లతో పాటు డ్యాన్స్ మాస్టర్లకు, యాంకర్స్ కు కూడా కౌగిలింతలు ఇవ్వాలని చెప్పింది. ఆ పని చేయడం ఇష్టం లేకే షో నుంచి తప్పుకున్నానని తెలిపింది. 

మరోవైపు ఇన్నాళ్లు సినిమాలతో, టీవీ షోలతో బిజీగా గడిపిన పూర్ణ... ఇప్పుడు జీవితం రెండో భాగంలోకి అడుగుపెట్టబోతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. యూఏఈలో ఉండే షానిద్ అసిఫ్ ను పెళ్లాడబోతోంది. ఇప్పటికే తన కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఆమె పరిచయం చేసింది.
Poorna
Dhee Show
Hugs
Tollywood

More Telugu News