KCR: గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్ బర్త్‌డే విషెస్
![krc wished tamilisai on her bith day](https://imgd.ap7am.com/thumbnail/cr-20220602tn6298bd88503ea.jpg)
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే తమిళిసై బర్త్ డే
- తమిళిసైకి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన కేసీఆర్
- మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని కేసీఆర్ ఆకాంక్ష
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్ తమిళిసైకి బర్త్‌డే విషెస్‌ను కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరిన్ని ఏళ్లపాటు ప్రజలకు సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ సదరు ప్రకటనలో ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాల నేపథ్యంలో చాలా కాలంగా కేసీఆర్ రాజ్ భవన్‌కే వెళ్లడం లేదు. అంతేకాకుండా గవర్నర్ నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు కూడా కేసీఆర్ హాజరు కావడం లేదు. కేసీఆర్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని మంత్రులు కూడా రాజ్‌భవన్‌కు దూరంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరిగ్గా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే తమిళిసై జన్మదినం కావడంతో ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ కేసీఆర్ ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.