YSRCP: 10 నిమిషాల్లోనే ముగిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌, జ‌గ‌న్ భేటీ

ap cm ys jagan meets union minister nirmala sitharaman

  • మోదీతో భేటీ త‌ర్వాత నిర్మ‌ల నివాసానికి జ‌గ‌న్‌
  • రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై నిర్మ‌ల‌కు జ‌గ‌న్ వివ‌ర‌ణ‌
  • కేంద్రం నుంచి మ‌రింత మ‌ద్ద‌తు కావాల‌ని అభ్య‌ర్థ‌న‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స‌హా ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాసేప‌టి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ అయ్యారు. ప్ర‌ధాని మోదీతో భేటీ ముగిసిన అనంత‌రం అటు నుంచి అటే నేరుగా నిర్మ‌ల అధికార నివాసానికి జ‌గ‌న్ వెళ్లారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మ‌ల‌తో ప‌లు అంశాల‌పై జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌రిపారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు మొదలైన‌ వీరిద్ద‌రి భేటీ కేవ‌లం 10 నిమిషాల్లోనే ముగియ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, అప్పులు, ప‌న్నుల రాబ‌డి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న స‌హ‌కారం, ఇంకా అందాల్సిన మ‌ద్ద‌తు త‌దిత‌రాల‌ను కేంద్ర మంత్రికి జ‌గ‌న్ వివ‌రించిన‌ట్లు స‌మాచారం.

YSRCP
Andhra Pradesh
YS Jagan
Nirmala Sitharaman
BJP

More Telugu News