Hardik Patel: నేడు బీజేపీలోకి హార్దిక్ పటేల్.. రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయమన్న యువ నేత

Hardik Patel today joins in BJP

  • ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసిన హార్దిక్ పటేల్
  • ప్రజల వద్దకు చేరుకునేందుకు కాంగ్రెస్ వద్ద సరైన రోడ్ మ్యాప్ లేదంటూ విమర్శలు
  • దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానన్న యువనేత
  • మోదీ నాయకత్వంలో సైనికుడిలా పనిచేస్తానని హామీ

కాంగ్రెస్ పార్టీకి ఇటీవల గుడ్‌బై చెప్పేసిన గుజరాత్ యువనేత హార్దిక్ పటేల్ నేడు కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం కోసం సైనికుడిలా పనిచేస్తానని, దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేటి నుంచి రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నానని ఈ ఉదయం ట్వీట్ చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్ ఇటీవల ఆ పార్టీ తీరుపై బహిరంగంగానే విమర్శలకు దిగారు. గుజరాత్‌లోని పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వానికి గుజరాత్‌పై అంతగా ఆసక్తి లేదని పేర్కొన్నారు. ప్రజల వద్దకు చేరుకునేందుకు ఆ పార్టీ వద్ద సరైన రోడ్ మ్యాప్ లేదని, అందుకనే ఆ పార్టీ ప్రతి చోటా తిరస్కరణకు గురవుతోందని విమర్శించారు. అంతేకాకుండా బీజేపీని ప్రశంసించడంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని భావించారు. అనుకున్నట్టుగానే ఆయన నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Hardik Patel
Gujarat
Congress
BJP
  • Loading...

More Telugu News