Jakkampudi Raja: ప్రభుత్వ ఇంజినీర్ పై చేయిచేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

YSRCP engineer Jakkampudi Raja slaps engineer
  • రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఘటన
  • చెంపపై మూడు సార్లు కొట్టారన్న ఇంజినీర్ సూర్యకిరణ్ 
  • ఉన్నతాధికారుల సమక్షంలోనే జరిగిందన్న బాధితుడు  
  • త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఇంజినీర్
వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివాదంలో చిక్కుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూర్యకిరణ్ పై ఆయన చేయి చేసుకోవడం కలకలం రేపుతోంది. తనను జక్కంపూడి రాజా కొట్టారంటూ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సూర్యకిరణ్ ఫిర్యాదు చేశారు. 

రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు పిలిపించి ఉన్నతాధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యే తన చెంపపై మూడు సార్లు కొట్టారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సూర్యకిరణ్ కు మద్దతుగా 20 మంది ఇరిగేషన్ ఇంజినీర్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇరిగేషన్ కు సంబంధించి ఎమ్మెల్యే ప్రశ్నలకు సమాధానం చెపుతుండగానే ఎమ్మెల్యే తనపై దాడి చేశారని చెప్పారు.
Jakkampudi Raja
YSRCP
Engineer

More Telugu News