Mahesh Babu: మహేశ్ మూవీలో కన్నడ సీనియర్ స్టార్!

Ravichandran in Trivikram Movie

  • త్రివిక్రమ్ తో మూడో సినిమాకి రెడీ అవుతున్న మహేశ్
  • కథానాయికగా మెరవనున్న పూజ హెగ్డే 
  • ప్రతినాయకుడిగా కనిపించనున్న తారకరత్న
  • వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా

మహేశ్ బాబు తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ చేస్తున్న మూడో సినిమా ఇది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. 

ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ప్రతినాయకుడిగా తారకరత్న చేయడం దాదాపు ఖరారైపోయింది. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ సీనియర్ స్టార్ రవిచంద్రన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కన్నడలో ఆయనకి క్రేజీ స్టార్ అనే బిరుదు వుంది. 

గతంలో ఆయన సినిమాలు తెలుగులోను విడుదలయ్యేవి. అయితే ఈ జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు ఆయన అంతగా తెలియదు. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర మాదిరిగా ఈ సినిమాలో రవిచంద్రన్ కి మంచి రోల్ పడినట్టుగా సమాచారం. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో నిలబెట్టాలని ఉద్దేశంతో ఆ దిశగానే పనులు మొదలెట్టారు.

Mahesh Babu
Pooja Hegde
Tarakarathna
Trivikram Movie
  • Loading...

More Telugu News