Narendra Modi: హైదరాబాద్ కు రానున్న మోదీ, అమిత్ షా.. మూడు రోజులు ఇక్కడే మకాం!

Modi and Amit Shah coming to Hyderabad

  • హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాలు
  • 300 నుంచి 500 మంది పార్టీ సీనియర్లు హాజరయ్యే అవకాశం

తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కబోతున్నాయి. తెలంగాణలో బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ... దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించబోతోంది. జులై మూడో వారంలో 15వ తేదీ తర్వాత ఈ కార్యక్రమం ఉండబోతోంది. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచ్చేస్తున్నారు. మూడు రోజుల పాటు వీరు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. ఈ సమావేశాలకు 300 నుంచి 500 మంది వరకు బీజేపీ సీనియర్లు హాజరవుతారని సమాచారం. మరోవైపు హెచ్ఐసీసీ నోవాటెల్‌ లో కానీ, తాజ్ కృష్ణలో కానీ ఈ సమావేశాలు జరగొచ్చని తెలుస్తోంది. సమావేశాల ఏర్పాట్లను తరుణ్ చుగ్, బీఎల్ సంతోష్ లు పరిశీలిస్తున్నారు.

Narendra Modi
Amit Shah
BJP
Hyderabad
  • Loading...

More Telugu News