Kamal Haasan: ప్రభాస్ ను లైన్లో పెట్టే పనిలో 'ఖైదీ' డైరెక్టర్!

Prabhas in Lokesh kanagaraj Movie

  • 'ఖైదీ'తో హిట్ కొట్టిన లోకేశ్ కనగరాజ్ 
  • ఈ నెల 3వ తేదీన రిలీజ్ కానున్న 'విక్రమ్'
  • లోకేశ్ కోసం లైన్లో ఉన్న విజయ్ .. ధనుశ్
  • ప్రభాస్ తోను ప్రాజెక్టు ఓకే అయ్యే ఛాన్స్  

ఇప్పుడు కోలీవుడ్లో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన కార్తి 'ఖైదీ' సినిమా, స్టార్ హీరోలంతా ఆయన వైపు చూసేలా చేసింది. తన మూడో సినిమా 'మాస్టర్'ను విజయ్ తో తెరకెక్కించిన ఆయన, నాల్గొవ సినిమాగా 'విక్రమ్'ను రూపొందించాడు. 

60కి పైగా భారీ సినిమాలు చేసిన విజయ్  .. దర్శకుడిగా మంచి అనుభవం ఉన్న కమల్ కూడా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపించారంటే ఆయన టాలెంట్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'విక్రమ్' ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ప్రభాస్ ను లైన్లో పెట్టాలనే ఆలోచనలో లోకేశ్ కనగరాజ్ ఉన్నాడని అంటున్నారు. ఆల్రెడీ ఒకటి .. రెండు సార్లు కథా చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. ప్రభాస్ ప్రాజెక్టు ఓకే అయినప్పటికీ, విజయ్ .. ధనుశ్ లతో లోకేశ్ చేయనున్న సినిమాలు పూర్తయిన తరువాతనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.  

Kamal Haasan
Vijay
Dhanush
Lokesh kanagaraj
  • Loading...

More Telugu News