Mahesh Babu: తన తండ్రి పుట్టినరోజు వేడుకలకు దూరంగా మహేశ్ బాబు.. కారణం ఇదే!

Mahesh Babu is in foreign tour on his fathers birthday
  • నిన్న 80వ పుట్టినరోజును జరుపుకున్న కృష్ణ
  • జన్మదిన వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు
  • ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ లో ఉన్న మహేశ్
లెజెండరీ యాక్టర్, సూపర్ స్టార్ కృష్ణ నిన్న 80వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడ ఇంటిలో విశ్రాంత జీవితం గడుపుతున్న కృష్ణ... ప్రతి ఏటా అక్కడే జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గిపోవడంతో అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. 

కృష్ణ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. భార్య ఇందిర, వారి కుమార్తెలు, చిన్నల్లుడు సుధీర్ బాబు, తమ్ముడు ఆదిశేషగిరి రావు, కుమారుడు రమేశ్ బాబు పిల్లలు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మరోవైపు, మహేశ్ బాబు ఈ వేడుకలో కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

అసలు విషయం ఏమిటంటే... తన ఫ్యామిలీతో కలిసి మహేశ్ బాబు ఫారిన్ టూర్ లో ఉన్నారు. అందువల్లే ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. అయితే, ట్విట్టర్ ద్వారా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో మీలాంటి గొప్ప వ్యక్తి మరొకరు ఉండరని మహేశ్ భావోద్వేగానికి గురయ్యారు.


Mahesh Babu
Krishna
Birthday
Tollywood

More Telugu News