Nikhil: ఆసక్తిని రేకెత్తిస్తున్న ' కార్తికేయ 2' మోషన్ పోస్టర్!

Karthikeya 2 movie update

  • కొంతకాలం క్రితం హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'కార్తీకేయ 2' 
  • ద్వారకానగర నేపథ్యంలో సాగే కథ
  • జులై 22వ తేదీన ఐదు భాషల్లో విడుదల

చందూ మొండేటి కొంతకాలం క్రితం తెరకెక్కించిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సాధించింది. నిఖిల్ హీరోగా నటించిన ఆ సినిమా, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2' రూపొందింది. వివేక్ కూచిభొట్ల .. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. 

ఈ కథ ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుందని ముందుగానే చెప్పారు. తాజాగా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ మోషన్ పోస్టర్ ను వదిలారు. "సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం ద్వారకా నగరం" అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను వదిలారు.

సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకలో దాగిన రహస్యాన్ని తెలుసుకోవడానికి అనుపమతో కలిసి నిఖిల్ బయల్దేరినట్టుగా ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో  జూలై 22వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News