Pawan Kalyan: జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు విషయంపై.. డీజీపీని కలవనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan to meet AP DGP Soon

  • డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరిన పార్టీ
  • అపాయింట్‌మెంట్ రాగానే వెళ్లి కలవనున్న నాయకుల బృందం
  • వెల్లడించిన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్

జనసేన కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జన సైనికులపై వేధింపుల విషయాన్ని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని నాయకుల బృందం డీజీపీని కలుస్తుందని మనోహర్ వివరించారు. డీజీపీని కలిసి కార్యకర్తలు, నాయకులపై మోపుతున్న అక్రమ కేసులను ఆయన దృష్టికి తీసుకెళ్తారని, వారికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతారని పేర్కొన్నారు.

Pawan Kalyan
Janasena
Andhra Pradesh
AP DGP
  • Loading...

More Telugu News