Nagarjuna: నాగార్జునను ఒప్పించే ప్రయత్నంలో 'రచ్చ' డైరెక్టర్!

Nagarjuna in Sampath Nnadi Movie

  • 'బంగార్రాజు'తో హిట్ కొట్టిన నాగ్ 
  • మరో మాస్ సబ్జెక్ట్ వైపు మొగ్గు 
  • సంపత్ నందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ 
  • త్వరలో థియేటర్లకు రానున్న 'ది ఘోస్ట్'

'బంగార్రాజు' సినిమాకి ముందు నాగార్జున చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన  'బంగార్రాజు' భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో మరో మాస్ యాక్షన్ మూవీ చేయాలనే ఉద్దేశంతో నాగార్జున ఉన్నారట. ఈ నేపథ్యంలోనే ఆయనను కలిసి సంపత్ నంది ఒక కథను వినిపించడం జరిగింది. 

సంపత్ నంది ఖాతాలో 'రచ్చ' .. 'బెంగాల్ టైగర్' వంటి మాస్ హిట్స్ ఉన్నాయి. అందువలన ఆయన కథ విన్న నాగార్జున, పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని రమ్మన్నారట. ప్రస్తుతం సంపత్ నంది అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. నాగార్జునను కనుక ఆయన ఒప్పించగలిగితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదు. 

నాగార్జున తాజా చిత్రంగా 'ది ఘోస్ట్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రవీణ్ సత్తారు నుంచి రానున్న ఈ సినిమాలో నాగ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. 'గరుడవేగ' తరువాత ప్రవీణ్ చేసిన సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాలో నాగ్ జోడీగా సోనాల్ మెరవనుంది.

Nagarjuna
Sampath Nandi Movie
Tollywood
  • Loading...

More Telugu News