Anand Mahindra: ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చిన పెళ్లికూతురు... స్పందించిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra responds to bride tractor driving video

  • మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో పెళ్లి వేడుక
  • ట్రాక్టర్ పై ఊరేగింపుగా వచ్చిన అమ్మాయి
  • అందరి దృష్టిని ఆకర్షించిన పెళ్లికూతురు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. పెళ్లి చేసుకుంటున్న ఓ యువతి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వివాహ వేదిక వద్దకు చేరుకుంది. ఆ పెళ్లికూతురు పేరు భారతి తార్గే. సాధారణంగా పెళ్లికొడుకులు కారులోనో, కొన్ని సందర్భాల్లో గుర్రం మీదో పెళ్లివేదిక వద్దకు రావడం సహజం. పెళ్లికూతురినైతే ఎంతో పదిలంగా తీసుకువస్తారు. 

కానీ, భారతీ తార్గే అందుకు భిన్నంగా బంధుమిత్రులతో కలిసి ఓ ట్రాక్టర్ పై ఊరేగింపుగా వచ్చింది. ఆమె ట్రాక్టర్ ను స్వయంగా నడపడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోను చూశారు. చూసిన తర్వాత స్పందించకుండా ఉండలేకపోయారు. 

"పెళ్లికూతురి పేరు భారతి... ఆమె నడుపుతున్నది స్వరాజ్ (మహీంద్రా రైజ్ బ్రాండ్ ట్రాక్టర్)... ఇది ఎంతో అర్థవంతంగా ఉంది" అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. అంతేకాదు, పెళ్లికూతురు డ్రైవింగ్ వీడియోను కూడా పంచుకున్నారు.

Anand Mahindra
Bride
Tractor Drivig
Video
Madhya Pradesh
  • Loading...

More Telugu News