Prabhas: నా నెక్స్ట్ సినిమాల హీరోలు వీరే: దిల్ రాజు

Dil Raju Upcoming

  • 'ఎఫ్ 3' సక్సెస్ అంటూ చెప్పిన దిల్ రాజు
  • ఎన్టీఆర్ తో చేసే ఉద్దేశం ఉందంటూ వెల్లడి   
  • ప్రభాస్ .. మహేశ్ .. బన్నీ ప్రాజెక్టులు లైన్లో పెట్టనున్నట్టు వివరణ 
  • పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాలు ఉంటాయంటూ స్పష్టీకరణ

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. ఏ కథ ఏ తరగతి ఆడియన్స్ కి నచ్చుతుందనేది ఆయనకి బాగా తెలుసు. ఆయన నిర్మించిన వాటిలో ఎక్కువ సినిమాలు సక్సెస్ జాబితాలో కనిపిస్తాయి. ఆయన తాజా చిత్రమైన 'ఎఫ్ 3' రీసెంట్ గా థియేటర్స్ కి వచ్చింది. 3 రోజుల్లోనే ఈ సినిమా 60 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ .. "ఎన్టీఆర్ తో సినిమా చేయాలని కొంతకాలంగా అనుకుంటున్నానుగానీ కుదరడం లేదు. ఎవరి సినిమాలతో వాళ్లం బిజీగా ఉండటమే అందుకు కారణం. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలను కొరటాలతోను .. ప్రశాంత్ నీల్ తోను చేయనున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయనతో సినిమా చేస్తాను. 

ఎన్టీఆర్ ను ఒకసారి కలిశానంటే ప్రాజెక్టు ఓకే అవుతుంది. ఆయనతో నాకు అంతటి సాన్నిహిత్యం ఉంది . అలాగే ప్రభాస్ .. మహేశ్ బాబు .. అల్లు అర్జున్ లతోను సినిమాలు చేయనున్నాను. ఒక ప్రాజెక్టు తరువాత ఒకటిగా ఈ సినిమాలు సెట్స్  పైకి వెళతాయి. ఈ హీరోలందరి క్రేజ్ తగినట్టుగానే ఈ సినిమాలు ఉంటాయి" అని ఆయన చెప్పుకొచ్చారు.

Prabhas
Mahesh Babu
Junior NTR
Dil Raju Movie
  • Loading...

More Telugu News