Adivi Sesh: నేను గర్వపడే సినిమా ఇది: ప్రకాశ్ రాజ్

Major movie update

  • ఊపందుకున్న 'మేజర్' మూవీ ప్రమోషన్స్
  • కీలకమైన పాత్రను పోషించిన ప్రకాశ్ రాజ్
  • ఈ సినిమాను తప్పకుండా చూడాలంటూ వ్యాఖ్య 
  • ఇందులో నటించినందుకు గర్వపడుతున్నానంటూ హర్షం 

తెలుగు .. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ప్రకాశ్ రాజ్ కి మంచి క్రేజ్ ఉంది. విలక్షణ నటుడిగా ఆయనకి ఎంతో మంచి పేరు ఉంది. అలాంటి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మేజర్' సినిమా సిద్ధమవుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడివి శేష్ టైటిల్ రోల్ ను పోషించాడు. 

హీరో మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా, జూన్ 3వ తేదీన తెలుగుతో పాటు మలయాళ .. హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ఇది హృదయాన్ని హత్తుకునే సినిమా అనీ, ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు. 

"ఈ సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్క రికీ కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను కూడా ఒక భాగమైనందుకు సంతోషంగానూ, గర్వంగాను ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది" అంటూ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ భార్య పాత్రలో రేవతి నటించగా, అడివి శేష్ సరసన కథానాయికగా సయీ మంజ్రేకర్ అలరించనుంది.

Adivi Sesh
Saiee Manjrekar
Prakash Raj
Major Movie
  • Loading...

More Telugu News