: ఈ మాతృత్వం అరుదైంది!


మాతృత్వం మహిళలందరికీ ఎంతో అపురూపమైంది. అయితే ఈ తల్లికి మాత్రం ఇది అరుదైన అపురూపం. ఎందుకంటే సుమారు 15 ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఆమెకు అప్పటికే 19 సార్లు గర్భస్రావం జరిగింది. చివరికి 20వ సారికి కల నెరవేరింది.

లండన్‌కు చెందిన జో అనే మహిళ 1997లో తొలిసారి గర్భం దాల్చింది. సహజంగా ఈ విషయం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే జోకు మాత్రం విషాదాన్ని మిగిల్చింది. తొలిసారి గర్భస్రావం జరిగింది. తర్వాత కాలంలో సుమారు 15 ఏళ్ల పాటు ఆమె సంతానం కోసం ఎదురుచూసింది. ఈమధ్య కాలంలో ఆమె 19 సార్లు గర్భం ధరించింది. అయితే అన్నిసార్లూ ఆమెకు గర్భస్రావం జరిగింది. గర్భాశయంలో పొర ఏర్పడి ఆమెకు గర్భస్రావం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సమస్యతో సుమారు 1.5 మిలియన్ల మహిళలు మాతృత్వానికి దూరమయ్యారు. అయితే చివరికి 20వ సారి మాత్రం జోను అదృష్టం వరించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె చాలా సంతోషపడిపోతోంది.

  • Loading...

More Telugu News