KA Paul: సోనియాగాంధీ దేశ ద్రోహి: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

KA Paul sensational comments on Sonia Gandhi

  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావన్న పాల్ 
  • రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని పిలుపు 
  • దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని వ్యాఖ్య 

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోనియా తెలంగాణ తల్లి కాదని... దేశద్రోహి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని పాల్ సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 48 ఎంపీ స్థానాలకు పరిమితమయిందని... రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 30 లేదా 20కి చేరుతుందని జోస్యం చెప్పారు. పార్టీల కంటే మనకు దేశమే ముఖ్యమని అన్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని విమర్శించారు. 

జాతీయ రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ పై జరిగిన దాడిని కేఏ పాల్ ఖండించారు. హైదరాబాదులో రెడ్డి గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ... అది రెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవ అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని... మాటల ద్వారా దాడి చేయడం కూడా తప్పేనని అన్నారు. 

పుచ్చలపల్లి సుందరయ్య గారు తన పేరు చివరన రెడ్డిని తొలగించుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు కులమతాలను ఉపయోగించుకుని ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశాన్ని నెంబర్ వన్ చేయాలనేదే తన తపన అని చెప్పారు.

KA Paul
Sonia Gandhi
Revanth Reddy
con
  • Loading...

More Telugu News