Pooja Hegde: పూజ హెగ్డేను వెతుక్కుంటూ వచ్చిన మరో స్పెషల్ సాంగ్!

Pooja Hegde in Animal movie

  • 'స్పెషల్ సాంగ్స్ జోరుపెంచుతున్న పూజ  
  • 'ఎఫ్ 3'లోను అందాల సందడి చేసిన భామ
  • 'యానిమల్' మూవీలోని మెరిసే ఛాన్స్ 
  • రణ బీర్ జోడీగా కనిపించనున్న రష్మిక    

సినిమాకి మాస్ కంటెంట్ మరింత అవసరమని భావించినప్పుడు స్పెషల్ సాంగ్ పెడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా పాటలకు కూడా హీరోయిన్స్ నే పెడుతున్న విషయం తెలిసిందే. అయితే చిన్న తరహా హీరోయిన్స్ ను తీసుకుంటే ఓ మాదిరి రెమ్యునరేషన్ ఇస్తే సరిపోతుంది. అదే స్టార్ హీరోయిన్ ను ఐటమ్ సాంగ్ కోసం తీసుకుంటే, ఒక సినిమాకి ఇచ్చే పారితోషికంలో సగం ఇచ్చేయవలసి ఉంటుంది. 

స్టార్ హీరోయిన్స్ కొన్ని నెలల పాటు కష్టపడితే వచ్చే డబ్బు ఒక్క ఐటమ్ సాంగ్ తీసుకుని వచ్చేస్తుంది. అందువల్లనే తమన్నా తరువాత పూజ హెగ్డే కూడా ఇప్పుడు ఈ తరహా పాటలను ఒప్పేసుకుంటోంది. 'రంగస్థలం' సినిమాలో జిగేల్ రాణి పాటలో జిగేల్ మంటూ మెరిసిన పూజ, రీసెంట్ గా 'ఎఫ్ 3' సినిమాలోను 'లైఫ్ అంటే' పాటలోను సందడి చేసింది.  

అలాంటి పూజను వెతుక్కుంటూ ఇప్పుడు బాలీవుడ్ మూవీ 'యానిమల్' నుంచి ఒక స్పెషల్ సాంగ్ వచ్చిందట. రణబీర్ కపూర్ - రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాను టి - సిరీస్ వారు నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Pooja Hegde
Animal Movie
Bollywood
  • Loading...

More Telugu News