Anupama Parameswaran: నేను ప్రేమిస్తున్న వ్యక్తి మనసులో ఏముందో నాకు తెలియదు: అనుపమ పరమేశ్వరన్

I am in love says Anupama Parameswaran

  • ప్రేమ వివాహమే చేసుకుంటానంటున్న అనుపమ 
  • ప్రేమ వివాహంపై తనకు మంచి అభిప్రాయం ఉందని వెల్లడి  
  • ప్రేమ వివాహం చేసుకున్న వారిని చూస్తే ముచ్చటేస్తుందని కామెంట్ 

కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 'ప్రేమమ్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి ఇప్పటికే పలు సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం '18 పేజెస్, 'కార్తికేయ', 'బటర్ ఫ్లై' చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.  

తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని అనుపమ తెలిపింది. తాను ప్రేమలో ఉన్నానని... కానీ అవతలి వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడా? లేదా? అనే విషయం తనకు తెలియదని... ఒక రకంగా చెప్పాలంటే తనది వన్ సైడ్ లవ్ అని చెప్పింది. ప్రేమ వివాహంపై తనకు మంచి అభిప్రాయం ఉందని... ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను చూస్తే చాలా ముచ్చటేస్తుందని తెలిపింది. తనకు ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉందని... ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలుసని చెప్పింది.

More Telugu News